తెలంగాణ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రైతు, భూమికి ఉండే బంధం తల్లీ బిడ్డల బంధం వంటిదన్నారు మంత్రి సీతక్క. అలాంటి బంధాన్ని ధరణి పేరుతో దోపిడీకి పాల్పడ్డారన్నారు. అసలైన రైతుకే భూ యాజమాన్య హక్కులు రావాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు మంత్రి సీతక్క. అందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు.

భూమి అంటే ఆత్మగౌరవం, కానీ ధరణి పేరుతో దగా చేసారని తెలిపారు. మొఖాపై ఉన్నప్పటికీ పట్టా బుక్కులు వేరొకరి పేరు చేర్చారన్నారు మంత్రి సీతక్క. అక్రమంగా పట్టాలు పొందిన అందరి రికార్డులు బయటపెడతామని హెచ్చరించారు మంత్రి సీతక్క.