ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ DSC అభ్యర్థులకు షాక్ తగలనుందా ?

-

ఈ రోజు ఉదయం తెలంగాణ తో పాటుగా మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలను జరగనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు DSC నిర్వహణకు అడ్డుగా మారుతాయా అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపే పరీక్షలను CBT విధానంలో జరిపించడానికి షెడ్యూల్ ఖరారు అయింది. ఆ షెడ్యూల్ ప్రకారం చూస్తే నవంబర్ 20 నుండి 30 వరకు పరీక్షలు జరగాలి. కానీ ఇప్పుడు ఎన్నికలు సడెన్ గా ఊడిపడడంతో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న DSC అభ్యర్థులకు ఈ విధంగా షాక్ తగులుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇప్పుడు అధికారులు తీసుకునే నిర్ణయం పైన ఈ పరీక్షల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.

కాగా వాయిదా వేసుకుంటే పరీక్షలను వాయిదా వేసుకోవడమే కానీ… ఎన్నికలు మాత్రం యధావిధిగా జరగనున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version