తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య సంఘటనలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు కానిస్టేబుళ్లు సాయి కుమార్, బాలక్రిష్ణ. కొల్చారం పోలీస్ స్టేషన్ లో చేట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సాయి కుమార్ ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు… సిద్దిపేటలో కుటుంబంతో సహా ఆత్మహత్యయత్నం చేశారు బాలక్రిష్ణ. పురుగుల మందుతాగిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బాలక్రిష్ణ. అయితే… భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లల్లకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చారు బాలక్రిష్ణ. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత ఉరివేసుకుని బాలక్రిష్ణ సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు సంఘటనలపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.