మెగా హీరో రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమా గేమ్ ఛేంజర్. అయితే… ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న తరుణంలో…. విజయవాడలో గేమ్ ఛేంజర్ ఫివర్ మొదలైంది. ఇక నేడు 256 అడుగుల రామ్ చరణ్ భారీ కట్ అవుట్ ప్రారంభోత్సవం ఉండనుంది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిల్ రాజు, తమన్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరు కానున్నారు.
జనవరి 10వ తేదిన విడుదల కానుంది గేమ్ ఛేంజర్ సినిమా. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్ సినిమా. 256 అడుగుల ఎత్తుతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కటౌట్ ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆవిష్కరించనుంది ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్.