హైదరాబాద్ కు చెందిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గత ఆగస్టునెలలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నెం.78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్ కి కేటాయిస్తూ.. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్ కి డీఎస్పీ పోస్టు కేటాయించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ మహ్మద్ సిరాజ్ కి డీఎస్పీ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు క్రికెటర్ సిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. సిరాజ్ దేశానికి, తెలంగాణ రాఫ్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తీసుకొచ్చాడంటూ అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సిరాజ్ ను ఘనంగా సన్మానించారు. అత్యున్నత స్థాయి క్రికెటర్లలో సిరాజ్ ఒకరు అని కొనియాడారు.