దుబ్బాక ఉపఎన్నిక: నేటి నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌

-

దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ మ‌రి కొద్దిసేట్లో విడుద‌ల కానుంది. దీంతో నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 16తో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు గడువు ముగియ‌నుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలుచేయవచ్చు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కోసం దుబ్బాక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. క‌రోనా నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేష‌న్ దాఖ‌లు చేసే అభ్య‌ర్థి వెంట ఇద్ద‌రిని మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా నామినేష‌న్ వేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు అనంత‌రం నామినేష‌న్ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి నేరుగా అందజేయాల్సి ఉంటుంది.

కాగా, రెండో శ‌నివారం, ఆదివారం సంద‌ర్భంగా 10, 11 తేదీల్లో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈనెల 17న నామినేష‌న్ల స్క్రూటినీ చేస్తారు. ఈనెల 19లోపు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. న‌వంబ‌ర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వ ‌హించ‌నున్నారు. అదే నెల 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక స్థానం ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే టీఆర్ ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత బ‌రిలో దిగుతుండ‌గా, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి ర‌ఘునంద‌న్ రావు పోటీ చేస్తున్నారు. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డం, నామినేష‌న్ల ప్ర‌క్రియ నేటి నుంచి మొద‌లు కానుండ‌టంతో దుబ్బాక‌లో పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version