అమూల్‌ పాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సీఎం జగన్‌ :దూళిపాళ్ల నరేంద్ర

-

సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని.. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ట్రంలోని పాడిరైతులను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదు? అని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారరి,, అమూల్ కోసం రూ.2,500ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్.. మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు కేటాయించ లేరా..? అని ప్రశ్నించారు. దాదాపు 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెబుతున్నారని నిప్పులు చెరిగారు. ఆయన లెక్కప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి రూ.70లు అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా? అని నిలదీశారు. విజయ డెయిరీ 11 శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమేనని చెప్పారు. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయని.. కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version