దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచడం తో ఇప్పుడు మూగ జీవాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాటి ఆలనా పాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. దీనితో అవి రోడ్ల మీదకు భారీగా వచ్చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. వన్య ప్రాణులు ఎక్కువగా రోడ్ల మీద కు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే…
ఇప్పుడు వేసవి… మన దేశంలో ఇతర దేశాలతో పోలిస్తే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. పశుగ్రాసం దొరకక ఆకలితో అలమటించిపోతున్నాయి. దాహార్తి తీర్చుకు నేందుకు నీరు కూడా వాటికి దొరికే పరిస్థితి కనపడటం లేదు. పలువురు… అక్కడక్కడ కొంతమంది మూగజీవాలకు పశుగ్రాసాన్ని తీసుకవచ్చి వేస్తున్నా సరే నీళ్ళు మాత్రం వాటికి దొరకడం లేదు అని అంటున్నారు. నీటిని అందించేందుకుగాను ఎవరూ ముందుకి రావడం లేదు.
ఇప్పుడు వర్షాలు కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి అవి మంచి నీళ్ళ కోసం బాగా ఇబ్బంది పడుతున్నాయి. నీటి కోసం మూగజీవాలు ఆయా ప్రాంతాల్లో గల మినీ ట్యాంక్‌లు, నల్లాల వద్దకు వెళ్లి దాహార్తిని తీర్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాయి. కొన్ని అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.