విజయవాడలోని దుర్గగుడిలో వెండి రథం ప్రతిమల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చోరీకి గురైన రథాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా వేలిముద్రలను సేకరించారు. కీలక కేసు కావడంతో ఫోరెన్సిక్ డైరెక్టర్ ఆర్.కే శారీన్ నేరుగా వచ్చి పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన రధాన్ని పరశీలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దేని సహాయంతో ప్రతిమలు చోరీ చేశారనే అంశాలపై ఫోరెనిక్స్ బృందం నివేదిక ఇవ్వనుంది.
ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. వెండి రథంలోని సింహాలు మాయం ఘటనపై కమిటీ వేసిన దేవాదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు… ఘటనపై పూర్తి విచారణ చేయాలని రీజనల్ జాయిట్ కమిషనర్ మూర్తిని ఆయన ఆదేశించారు. ఈ ఘటన మీద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదని పేర్కొన్నారు.