గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన “ఈగల్” కదన రంగంలోకి దిగింది. గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ విధివిధానాలపై హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గంజాయి, డ్రగ్స్ సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్ పోలీస్‌స్టేషన్ , జిల్లాకో విభాగం, ఐదు చోట్ల ప్రత్యేక కోర్టులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ఎక్కడా సరఫరా జరిగినా ఈగల్ తన ప్రతాపం చూపిస్తుందని కూటమి సర్కార్ స్పష్టంచేసింది.