Business Ideas : ఆవుపేడతో స్టిక్స్ త‌యారీ.. పని తక్కువ లాభం ఎక్కువ..!

-

ఆవు పేడ స్టిక్స్ ఏంటి..? వాటి త‌యారీ బిజినెస్ ఏంటీ..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే నిజానికి ఇది కొత్త ప‌ద్ధ‌తి ఏమీ కాదు. పాత తరం పిడ‌క‌ల త‌యారీ నుంచి వ‌చ్చిందే. పిడ‌క‌లు త‌యారీ అనేది చేతితో చేయాల్సి ఉంటుంది. చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఆవు పేడ స్టిక్స్ అలా కాదు. మెషిన్‌తో చాలా త్వ‌ర‌గా అవుతాయి. దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించుకోవ‌చ్చు. మ‌రి ఆ స్టిక్స్ మెషిన్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? నిత్యం ఏ మేర సంపాద‌న ఉంటుంది..? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

ఆవు పేడ స్టిక్స్‌ను త‌యారు చేసే మెషిన్ ఖ‌రీదు దాదాపుగా రూ.45వేల వ‌ర‌కు ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వ‌వ‌చ్చు. జీఎస్‌టీ, డెలివ‌రీ చార్జిలు అద‌నంగా అవుతాయి. ఇక ఈ మెషిన్ లో వేసేందుకు ఆవు పేడ కావాలి. డైరీ ఫాం ఉన్న‌వారు త‌మ ఫాంలో ఉత్ప‌త్తి అయ్యే ఆవు పేడ‌నే ఈ మెషిన్‌లో వేసేందుకు ఉప‌యోగించ‌వ‌చ్చు. అలా కాకుండా ఆవు పేడను రైతుల నుంచి కొనుగోలు కూడా చేయ‌వ‌చ్చు. అలా సేక‌రించిన పేడ‌ను 2 నుంచి 3 రోజుల వ‌ర‌కు ఎండ‌బెడితే అందులో ఉండే తేమ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. ఆ త‌రువాత పేడ‌ను మెషిన్‌లో వ‌స్తే.. దాన్నుంచి పొడ‌వాటి స్టిక్స్ త‌యారై బ‌య‌ట‌కు వ‌స్తాయి.

అలా త‌యారైన స్టిక్స్‌ను మ‌ళ్లీ 2 రోజుల పాటు ఎండ‌బెట్టాలి. దీంతో స్టిక్స్ గట్టిగా మారుతాయి. ఇక వాటిని ప‌రిశ్ర‌మ‌ల బాయిల‌ర్ల‌కు, శ్మ‌శాన‌వాటిక‌లకు, చిరుతిళ్ల‌ను త‌యారు చేసే కార్ఖానాల‌కు స‌ప్ల‌యి చేసి ఆదాయం పొంద‌వ‌చ్చు. అందుకు గాను వారితో టై అప్ అవ్వాలి. మార్కెటింగ్ చేయాలి. దీంతో ఎక్కువ మొత్తంలో ఆవు పేడ స్టిక్స్‌ను త‌యారు చేసి నిత్యం వారికి స‌ర‌ఫ‌రా చేసి.. ఆ మేర లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇక ఆవు పేడ స్టిక్స్ మెషిన్ ద్వారా 1 గంట‌కు 200 స్టిక్స్ చొప్పున నిత్యం 5 గంట‌ల పాటు ప‌నిచేస్తే 1000 స్టిక్స్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఒక్కో స్టిక్‌ను రూ.5కు విక్ర‌యిస్తే.. 1000 స్టిక్స్‌కు రూ.5వేలు అవుతాయి. అందులో స‌గం వ‌ర‌కు ఖ‌ర్చులు తీసేసినా రూ.2500 వ‌ర‌కు లాభం ఉంటుంది. ఈ క్ర‌మంలో నెల‌కు 30 * 2500 = రూ.75000 వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు. ఇలా చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఈ వ్యాపారం చేసి లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version