గ్రీన్ – ఆరెంజ్ – రెడ్ జోన్లను ఎలా విభజిస్తారు?

-

కరోనా వైరస్ వ్యాప్తి కొందరికి తీవ్రంగా కనిపిస్తుంది… మరికొందరికి తేలిగ్గా కనిపిస్తుంది. అందుకే లాక్ డౌన్ కావాలని కొందరంటుంటే… అబ్బే అవసరం లేదు లాక్ డౌన్ ఎత్తేయండి అని ఇంకొందరు అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… లాక్ డౌన్ 3.0 కండిషన్స్ ప్రకారం కరోనా వైరస్ అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా విజృంభిస్తూ.. మరికొన్ని చోట్ల కొంత ప్రభావం ఉండగా.. ఇంకొన్ని చోట్ల అసలు వ్యాప్తి చెందలేదు. వీటి ఆధారంగానే రెడ్ – ఆరెంజ్ – గ్రీన్ జోన్లుగా కరోనా ప్రభావిత ప్రాంతాలను విభజించారు. అయితే… అసలు ఈ జోన్లను శాస్త్రీయంగా ఎలా విభజిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం!

కంటైన్ మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతం.. కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్ గా పిలుస్తారు. ఇప్పటికే అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉండి.. ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ లేదా హాట్ స్పాట్ గా పిలుస్తారని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులున్న జిల్లాను రెడ్ జోన్ గా పిలుస్తారు. నాలుగు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయిన జిల్లాను రెడ్ జోన్ గా పరిగణిస్తారు.

ఇదే క్రమంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తక్కువగా నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్ గా పరిగణిస్తారు. రెడ్ జోన్ గా ఉన్న ఏరియాలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కానిపక్షంలో అప్పుడు ఆ రెడ్ జోన్ ని కాస్త ఆరెంజ్ జోన్ గా మారుస్తారు. అలాగే… పాజిటివ్ కేసులు ఏమీ నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పిలుస్తారు. ఇదే క్రమంలో ఆరెంజ్ జోన్ లో 14 రోజుల పాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కానిపక్షంలో అప్పుడు ఆ ఆరెంజ్ జోన్ ని గ్రీన్ జోన్ గా మారుస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version