ఇక నుంచి ట్విటర్ పోస్టులతో డబ్బు సంపాదించుకోవచ్చు : ఎలాన్ మస్క్

-

ట్విటర్​ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ఆ సంస్థలో భారీ మార్పులు చేశారు. ఉద్యోగుల నుంచి మొదలుకుని.. యాప్​ వరకు సమూల మార్పులు చేస్తున్నారు. అయితే తాజాగా ఎలాన్ మస్క్ ట్విటర్ యూజర్లకు ఓ గుడ్​న్యూస్ చెప్పారు. ఇక నుంచి ట్విటర్ పోస్టుల ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చని తెలిపారు.


సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ అమెరికాలోనే ఉందని తెలిపారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని తెలిపారు.

ఇలా తమ కంటెంట్‌ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విటర్‌ ఎలాంటి రుసుములూ తీసుకోబోమని మస్క్‌ వెల్లడించారు. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వచ్చేస్తుందని తెలిపారు. ట్విటర్‌ ద్వారా ఆర్జిస్తున్న మొత్తంలో నుంచి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 30 శాతం యాప్‌స్టోర్‌ ఫీజు కింద వసూలు చేస్తోంది. వెబ్‌లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ స్పష్టం చేశారు. అలాగే కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకూ ట్విటర్‌ సహకరిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version