పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావానికి 15 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఈరోజు ఉదయం బలుచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది. అనంతరం కెట్టా లో భూ ప్రకంపనలు రావడం తో ప్రజలంతా భయం తో పరుగులు తీశారు. ఈ ఘటన లో గాయపడిన వాళ్ళను ఆస్పత్రులకు తరలించారు.
ప్రస్తుతం కూడా భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 6 గా నమోదైంది. భూకంపం తీవ్రత ను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.