వరసగా వస్తున్న భూకంపాలు భారత్ ను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అండమాన్ ప్రాంతాల్లో భూప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా మణిపూర్ రాష్ట్రం మరోమారు భూకంపం వచ్చింది. ఉక్రుల్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. . రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమికి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. సోమవారం కూడా ఇదే ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది . తాజాగా ఇదే చోట మళ్లీ భూకంపం సంభవించింది. సోమవారం అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం వచ్చింది. గత వారం రోజులుగా గుజరాత్ లోని ద్వారకా, అస్సాంలోని తేజ్పూర్, అరుణా చల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భూకంపాలు చోటు చేసుకున్నాయి.
ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయన్ రీజియన్ లో ఇవి ఎక్కువ అయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు వస్తాయి.. కానీ ఇటీవల భూకంపాల తీవ్రత ఎక్కువ అవుతోంది.