భూకంపం.. బొగ్గు గని కార్మికులు భయపడాల్సిన పనిలేదు : జీఎం

-

తెలంగాణలో బుధవారం ఉదయం పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఉదయం 7 గంటల 20 నిమిషాలకు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని, రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.3గా నమోదైనట్లు పేర్కొన్నారు. భూకంపం తీవ్రతపై హైదరాబాద్ ఎన్జీఆర్ఐ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.

ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు వారు వివరించారని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఎన్జీఆర్‌ఐ అధికారులు భూకంప ప్రభావంపై మరింత అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఓపైన్ మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్‌లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను గనుల లోనికి అనుమతిస్తామని జీఎం క్లారిటీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news