సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త…!

-

సొంతిల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటూ వుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. అతితక్కువ వడ్డీతో సొంతింటిని ఇప్పుడు నిర్మించుకోచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజి స్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నావి ఫిన్‌సర్వ్ రుణ గ్రహీతలకు సదుపాయాన్ని కల్పిస్తోంది.

అతి తక్కువ వడ్డీతో హౌసింగ్ లోన్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని నావీ సంస్థ గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నావి ఫిన్‌సర్వ్ రుణ గ్రహీతలకు సదుపాయాన్ని ఇస్తోంది. బ్యాంకులు, ఇతర హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీల కన్నా వడ్డీతో పాటు, త్వరగానే రుణాలు అందిస్తామని కంపెనీ అంది.

హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు కూడా 6.46 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీల కన్నా ఇది తక్కువ వడ్డీ రేటు. మంచి క్రెడిట్ స్కోర్, లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ కలిగి స్థిరమైన ఆదాయం పొందే వారికి తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. నావి యాప్ ద్వారానే సులభంగానే లోన్ అప్లై ప్రాసెస్ పూర్తి చేసుకోచ్చు.

20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్ పొందొచ్చు. 25 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్ ఎంచుకునే ఆప్షన్ వుంది. హైదరాబాద్ సహా దేశంలో పలు పట్టణాల్లో నివసించే వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు, మైసూర్, హుబ్లి, దేవంగిరి, గుల్‌బర్గా, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్ మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ముంబై, పుణేలో కూడా త్వరలో తీసుకు రానున్నారు. లోన్ పొందాలని అనుకుంటే నావి యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పర్సనల్, ఎంప్లాయిమెంట్ వివరాలు అందించాలి. మంత్లీ ఇన్‌కమ్ ప్రూఫ్, ప్రాపర్టీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version