తూర్పు గోదావరి టీడీపీలో చీలికలు..

-

ఏపీలో టీడీపీ నేతల మధ్య చీలకలు బయటపడుతున్నాయి. అయితే.. తాజాగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో చీలికలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిసెంబరు 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనకు వస్తుండగా, పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో, కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యుల కమిటీ సమావేశమైంది.

ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. అయితే, ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. జవహర్ ను కూడా వేదికపైకి పిలవాలని ఆయన వర్గం డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్, ఇద్దరు సభ్యుల కమిటీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version