వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల పదవుల్లో భారీగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. పలువురిని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మార్చేశారు. ఈ నాయకత్వ మార్పుపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మట్లాడుతూ… పదవులను మార్చినంత మాత్రాన ఆ నాయకులను తక్కువ చేసినట్టు కాదని అన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను మరో చోట వినియోగించుకోవాలనేది పార్టీ ఆలోచన అని చెప్పారు. పాదయాత్రలు ఎవరు చేసినా నష్టమేమీ లేదని… ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత జగన్ దని అన్నారు. ఏపీలో ప్రజల సంక్షేమ పథకాలు రాజ్యాంగ స్ఫూర్తితో అమలవుతున్నాయని చెప్పారు. టీడీపీ పాలనలో చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.
పార్టీలో ఎవరూ చేరిన స్వాగతిస్తామని.. అయితే చేరికలతో ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయని, ఎంతో మంది మంతనాలు జరుపుతుంటారని.. అయితే ఎవరిని పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకుంటారని చెప్పారు