దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది వారి జీవనోపాధిని కోల్పొయారు. ఈ క్లిష్ట సమయంలో లోన్ తీసుకోవాలని చూస్తున్నారా అయితే ఇది మీ కోసమే. అయితే బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడం అంత ఈజీ కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదలకు సులభంగానే రుణాలు అందించాలని ఆలోచిస్తుంది. దీనికి అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిలు రెడీ చేస్తున్నారు.
అయితే సామాజిక సంస్థల ద్వారా పేదలకు చిన్న మొత్తంలో సులభంగానే రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గడ్కరి తెలియాజేశారు. ఈ అంశానికి సంబంధించి నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ సహా టాటా గ్రూప్‌తో చర్చించినట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా రిజర్వు బ్యాంక్ సులభంగా ఆమోదం తెలిపేలా వీరందరూ ఒక పాలసీని రూపొందించడంలో నిమగ్నమయ్యారని గడ్కరి పేర్కొన్నారు. సోషల్ మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్లకు ఈ మేరకు లైసెన్స్ అందిస్తామని తెలిపారు. అలాగే ఈయన ఎంఎస్ఎంఈ రంగానికి ఆర్థిక తోడ్పాటు అంశంపై కూడా స్పందించారు.
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే వీటిపై ఒత్తిడి నెలకొని ఉందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. వెబ్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన పూర్తి పారద్శకతతో, నిర్ణీయ వ్యవధిలో సత్ఫలితాలనిచ్చే ఒక కంప్యూటరైజ్డ్ వ్యవస్థ అవసరమన్నారు. దీని ద్వారా మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ సాయంతో పేదలకు సులభంగానే రుణాలు అందించేందుకు సిద్ధమౌతున్నామని వెల్లడించారు.
అంతేకాకుండా ఆయన రైతులకు సంబంధించిన మార్కెటింగ్ అంశంపై కూడా స్పందించారు. రైతులు, కంపెనీలు సంయుక్తంగా ప్రొడక్టులను తయారు చేస్తే అప్పుడు ప్రొడక్షన్ వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో తక్కువ ధరకే ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు. నాణ్యత అంశంలో కూడా రాజీ పడాల్సిన అవసరం ఉండదని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.