పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం సులువైన చిట్కాలు..

-

మన దేశంలో పాడిపశువులకు కూడా మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. అయితే మనుషులకు ఏ విధంగా అయితే జబ్బులు చేస్తాయో వాటికి కూడా అలానే జబ్బులు వస్తుంటాయి. అందుకే వాటి రక్షణ కోసం తగు జాగ్రత్తలు కూడా పాటించాలి.. పశువులు సక్రమంగా మేత మేస్తూ, ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి..

 

పశువులు సక్రమంగా మేత మేస్తూ, ఇతర ఇబ్బందులు లేకుండా, దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే సగం సంకర జాతి జెర్సీ ఆవును లేదా సంకరజాతి హెచ్.ఎఫ్. జాతి ఆవులను ఎన్నుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటివద్దనే చెట్ల నీడలలో గానీ, పాక లేదా తాటాకు షెడ్ల కింద చల్లటి వాతావరణంలో పోషించినట్లయితే మంచి పాలదిగుబడినిస్తాయి.గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన వేసవి తాపాన్ని తట్టుకోలేవు. వాటిని ఉదయం పూటనే మేతకు పంపాలి. పగటిపూట ఇంటి వద్ద చల్లటివాతావరణంలో పోషించాలి.

పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిలవకుండా చూసుకోవాలి. దాని వల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు..పశువులకు మంచి పోషకాహార పదార్థాలు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కోసం, ఒక వేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించవలసి ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత, దాణా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురికినీరు, కలుషిత ప్రాంతాలలో నీరు తాగించడం వల్ల పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి..అందుకే వాటిని ఎప్పుడూ చేస్తూ ఉండాలి..వైద్యుల సలహాలను పాటించాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version