బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలంటే ఈ ఆహారపదార్ధాలను తీసుకోండి..!

-

బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వక పోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా అవ్వకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్, ఒబిసిటీ, స్మోకింగ్ మొదలైన వాటి వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వదు.

బ్లడ్ సర్కులేషన్ సరిగా అవ్వట్లేదు అంటే నొప్పి కలగడం, జీర్ణ సమస్యలు, మజిల్ క్రాంప్స్ మొదలైన లక్షణాలు ఉంటాయి. అయితే మీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగ పడుతాయి. డైట్ లో వీటిని తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అయితే మరి డైట్ లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. రోజు నాలుగు నుండి ఐదు గ్రాముల ఉల్లి రసం తీసుకుంటే బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

టమాటా:

బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచడానికి టమాటా కూడా బాగా ఉపయోగపడుతుంది. బీపీ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. టమాటా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ వెస్సెల్స్ ఓపెన్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ సరిగా అవుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకించి వీటికోసం చెప్పక్కర్లేదు. అలానే ఆకుపచ్చ కూరగాయలు కూడా తీసుకోండి వీటివల్ల కూడా బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version