వంద శాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా : కేటీఆర్

-

అధికార పక్షానికి కేటీఆర్ సవాల్ విసిరారు. వంద శాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా అన్నారు కేటీఆర్. ఏ ఊరిలోనైనా పూర్తిగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తెలంగాణ లో ఎక్కడికైనా వెళ్దాం.. కొడంగల్, కొండారెడ్డి పల్లి, సిరిసిల్ల ఇలా ఎక్కడైనా వెళ్దాం అన్నారు. ఎన్నికలప్పుడు అందరికీ అన్ని.. ఇప్పుడేమో కొందరికీ కొన్ని అంటున్నారు.

తెలంగాణ లో కోటి మంది పాన్ కార్డులున్నాయి. పాన్ కార్డులు ఉన్న అందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రబుత్వ ఉద్యోగులకు భూమితో ఉన్న సంబంధం తెంచేస్తారా..? అని ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు బంధును ఆదర్శంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రపంచంలో పలువురు శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకుందని తెలిపారు. రైతు బంధుతో రైతులకు ఇబ్బందులు లేకుండా ఒక భరోసా లా ఉంటుందని మేధావులు చెప్పినట్టు గుర్తు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version