ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతున్న సంగతి తెలిసిందే. విగ్రహం తయారీలో వాడే రంగుల వల్ల మరింత కలుషితం అవుతుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందు నుండి మట్టి వినాయకుడి విగ్రహాలను వాడాలని ప్రజలకు సూచిస్తూ వస్తోంది. ఇక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇక హైకోర్టు విగ్రహాల నిమజ్జనం కు అనుమతలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఖైరతాబాద్ లో కూడా మట్టి వినాయకుడిని పెట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్షి ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీతో చర్ఛలు జరిపారు. ఈ చర్చల్లో మట్టివినాయకుడిని ఏర్పాటు చేసేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కూడా ఓప్పుకుంది. 70 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు కమిటీ అంగీకరించింది. దాంతో వచ్చే ఏడాది నుండి ఖైరతాబాద్ లో మట్టి గణపతి దర్శనం కలగనుంది.