ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సుఖేశ్ గుప్తా తగినంత సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించకపోవడమే కాకుండా.. ఫారెక్స్ కవర్ లేకుండానే భారీ ఎత్తున బంగారాన్ని తెచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోయినా కొందరు అధికారుల సహకారంతో.. సంస్థ ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు సమర్పించారని దర్యాప్తులో తేలింది.
ఎంబీఎస్ వ్యవహారంపై దృష్టిసారించిన ఈడీ గతేడాది ఆస్తులను జప్తు చేయడం సహా రెండు రోజులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారంతో పాటు, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.