TSPSC పేపర్ లీకేజీ కేసు.. ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఈడీ

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ఓవైపు సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో కమిషన్ ఛైర్మన్‌ను సోమవారం రోజున విచారించింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో కీలక ప్రశ్నలు అడిగింది. అనంతరం ఛైర్మన్ వాంగ్మూలం రికార్డు చేసింది.

మరోవైపు ఈ కేసుపై ఈడీ దృష్టి సారించింది. లీకేజీ ఘటనపై దర్యాప్తు షురూ చేసింది. న్యాయస్థానం నుంచి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఈడీ అధికారులు తీసుకున్నారు. దీని ఆధారంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు(ఈసీఐఆర్‌) నమోదు చేశారు.

మరికొద్ది రోజుల్లో సిట్‌ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశముంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్‌, తిరుపతయ్యల 5 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను సిట్‌ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు తిరుపతయ్యను సస్పెండ్‌ చేస్తూ డీఆర్డీవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారని గండీడ్‌ ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version