ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. ఇదే కేసులో ఈనెల 3న సోరెన్‌కు ఈడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోజున ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ సీఎం సోరెన్ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
అక్రమ మైనింగ్ కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు ఈడీ అధికారులు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. జులై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఈడీ మిశ్రాకు చెందిన 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్లు సీజ్ చేశారు.ఆయన ఇట్లో లెక్కల్లోకిరాని రూ.5.34 కోట్లను గుర్తించారు. మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.