BIG BREAKING : లైగర్‌ సినిమాలో రాజకీయ నేతల పెట్టుబడులు.. ఈడీ ఆఫీసుకు పూరీ, చార్మి

-

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన సినిమా లైగర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాను పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్‌, చార్మిలు నిర్మించారు. అయితే.. ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో ఈడీ పూరి జగన్నాథ్‌, చార్మిలకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. అయితే.. ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీసులో పూరీ జగన్నాథ్, చార్మిలను అధికారలు విచారిస్తున్నారు. ఉదయం నుంచి పూరీని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. 15 రోజులక్రితమే పూరీకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

విదేశీ పెట్టుబడులపై పూరీ జగన్నాథ్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల క్రితం డ్రగ్స్‌ కేసులో పూరీ జగన్నాథ్‌, చార్మిలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పూరి జగన్నాథ్‌, చార్మిలతో పాటు ఇతరులకు కూడా క్లీన్‌ చిట్‌ను ఇచ్చింది ఈడీ. అయితే.. తాజాగా పరిణామాలలో ఈడీ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version