మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎంపురాన్’ నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్స్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం గోకులం చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తమిళనాడు,కేరళలోని ఆయన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, తమిళనాడు మరియు కేరళలోని ప్రముఖ గోకులం చిట్ ఫండ్స్ యజమానిగా కూడా గోకులం గోపాలన్ ఉన్నారు. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో కలెక్షన్లు కూడా భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.