బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు నియామకం అయ్యారు. హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ఖరారు చేసింది. ఈరోజు(శుక్రవారం) గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాగా వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడంపై కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీ. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం చరిత్రాత్మకం అన్నారు ప్రధాని మోదీ. ఇది సరికొత్త యుగానికి నాందని చెప్పారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో ముస్లిం మహిళలు, పేదలు ఇబ్బంది పడ్డారన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని చెప్పారు ప్రధాని మోదీ.