ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. జగన్, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు పేర్కొంది.
14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసులో రూ.800 కోట్ల విలువైన భూములు,షేర్లను ఈడీ తాజాగా జప్తు చేయడం గమనార్హం. 2009 – 2010 కాలంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కాగా, జగన్ ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో ఆయన్ను వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఏపీ సర్కార్ కేసులు పెట్టి విచారిస్తున్న విషయం తెలిసిందే.