బీఆర్ఎస్ పాలనలో రైతు సదస్సులు పెట్టుంటే వీపు విమానం మోత మోగేది : మంత్రి పొంగులేటి

-

గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్రంగా విరుచుకపడ్డారు. అప్పట్లో తెచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సులు పెట్టి ఉంటే వీపు విమానం మోత మోగేదని మంత్రి పొంగులేటి విమర్శించారు.

అసెంబ్లీలో వీధి రౌడీల్లా భూ భారతి చట్టాన్ని బీఆర్ఎస్ శానససభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఓ సభలో మాట్లాడారు.రెండు పర్యాయాలు చెంప చెల్లుమనేట్లు ప్రజలు తీర్పు ఇచ్చినా వారికి జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు.పేదల కన్నీటిని తుడిచేందుకు భూ భారతిని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news