ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవో ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పలు సార్లు ఈ జీవో గురించి పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. తాజా గా ఈ రోజు జీవో నెంబర్ 317 ను సవరించాలని సీఎం కేసీఆర్ కు ఉపాధ్యాయ సంఘాలు లేఖ రాశాయి. ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోకుండా బదిలీలు జరిగాయని లేఖలో తెలిపారు. జీవో నెంబర్ 317 లో పలు లోపాలు ఉన్నాయని అన్నారు.
ఈ జీవో ను సవరించి ఉద్యోగ నియామకాల్లో స్థానికతను కాపాడాలని కోరారు. ఈ జీవో ద్వారా చాలా మంది ఉద్యోగులు స్థానికతను కోల్పోయారని తెలిపారు. అలాగే సీనియారిటీ జాబితాలను సమంగ్రాంగా రూపొందిచలేదని ఆరోపించారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు స్థానికత పై ప్రాధాన్యత ఇవ్వలేదని సీఎం కేసీఆర్ కు తెలిపారు. అలాగే భార్య భర్తల బదిలీల విషయంలో పలు చోట్ల అక్రమాలు జరిగాయని తెలిపారు. దీని అప్పిల్ చేసుకున్నా.. స్పందన కరువు అయిందని అన్నారు. ఈ సమస్య సీఎం కేసీఆర్ దృష్టి వెళ్లలేదని తెలిపారు. కాగ జీవో నెంబర్ 317 ను సవరించి స్థానికతను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరారు.