ఏపీలో రాజకీయ పరిస్తితులు గందరగోళంగా ఉన్నాయనే చెప్పాలి. ఓ వైపు ప్రజా సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి..అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపైనే రాజకీయాలు నడుస్తున్నాయి. బాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు పోరాడుతున్నారు. అలాగే బాబుకు వివిధ పార్టీల వారు మద్ధతుగా నిలుస్తున్నారు. పవన్ పూర్తిగా బాబుకు సపోర్ట్ ఇస్తున్నారు. అటు జాతీయ స్థాయిలో బాబుకు మద్ధతు పెరిగింది.
ఇక బాబు తప్పులని ఎత్తిచూపిస్తూ..ఆయన అనేక అక్రమాలు చేశారని అందుకే జైలుకు వెళ్లారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక బాబు అరెస్ట్ కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా తమకు తిరుగు ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో బాబుని అరెస్ట్ చేసి వైసీపీ పెద్ద తప్పు చేసిందని, ఆయనకు ప్రజల మద్ధతు ఇంకా పెరిగిందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. బాబు తప్పు చేయలేదని టిడిపి, తప్పు చేశారని వైసీపీ వాదించుకుంటున్నాయి. ఇటు జనసేన సైతం టిడిపి వైపు ఉంది. కమ్యూనిస్టులు టిడిపికి మద్ధతు ఇస్తున్నారు. బిజేపి ఏమో సైలెంట్ గా ఉంది.
ఇలా రాజకీయ పార్టీలకు ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఏం అనుకుంటున్నారు..బాబు అరెస్ట్ మాత్రమే కాదు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి..ఇటు వైసీపీ సంక్షేమ పథకాలు అందిస్తుంది. రకరకాల అంశాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో తెలియడం లేదు.
వైసీపీ ఓటర్లు, టిడిపి ఓటర్లు, జనసేన ఓటర్లు ఉన్నారు…వారు వారి పార్టీలకు మద్ధతుగా ఇచ్చుకుంటారు. కానీ న్యూట్రల్ గా ఉన్న ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియకుండా ఉంది. వారి బట్టే గెలుపోటములు డిసైడ్ అవుతాయి. గత ఎన్నికల్లో న్యూట్రల్ వర్గం పూర్తిగా వైసీపీకి మద్ధతు ఇచ్చారు. మరి ఇప్పుడు వారు ఎటువైపు ఉంటారో చూడాలి. మొత్తానికైతే ఏపీలో ప్రజానాడి మాత్రం దొరకడం లేదు.