టెట్ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్….ఈ రూల్స్ పాటించాల్సిందే

-

రేప్ టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. శుక్రవారం రోజున ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్-వన్… మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ టూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టెట్‌ కన్వీనర్ రాధా రాణి తెలిపారు.

టెట్ అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే

రేపు (సెప్టెంబర్ 15) ఉ. 9:30 నుంచి మ. 12 వరకు పేపర్-1, మ. 2:30 నుంచి సా. 5 వరకు పేపర్-2 పరీక్ష

*ఉదయం 9 గంటలలోపు, మధ్యాహ్నం 2 గంటల్లోపు ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పర్మిషన్ ఉండదు.

*OMR షీట్ నింపేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఇతర కలర్ పెన్ వాడితే కరెక్షన్ చేయరు.

*OMR షీట్ ను మలవడం, పిన్నులు కొట్టడం, ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించవద్దు. పైన పేర్కొన రూల్స్ అందరూ పాటించాల్సిందేనని పేర్కొన్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version