ఎడిట్ నోట్: ‘ఆంధ్రా’ కేసీఆర్..!

-

ఇంతకాలం తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తూ..తెలంగాణలో రాజకీయంగా తిరుగులేని బలం సంపాదించుకుని..రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్..ఆంధ్రా కేసీఆర్‌గా మారారు. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బయలుదేరిన కేసీఆర్..బీఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో భాగంగా..తాజాగా ఏపీపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ బీఆర్ఎస్ శాఖని ఏర్పాటు చేశారు.

ఇదే క్రమంలో తాజాగా ఏపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు..తాజాగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తోట గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, రావెల ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అలాగే కేసీఆర్..ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా తోటని నియమించారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న సమస్యలపై కేసీఆర్ ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన సరే..నెక్స్ట్ బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాన్ని వెనక్కి తీసుకుందని అన్నారు.

ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగనున్నాయని చెప్పుకొచ్చారు. సంక్రాంతి తర్వాత ఏపీలో చాలామంది నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారని, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరడానికి రెడీగా ఉన్నారని కేసీఆర్ బాంబు పేల్చారు. అయితే టోటల్ గా కాపు నేతలనే కేసీఆర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కాపులతో ఎవరిని దెబ్బతీస్తారో క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఏపీలో కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఏపీలో కేసీఆర్‌కు అంత సీన్ లేదని, ఏపీకి అన్యాయం చేసింది తెలంగాణ నేతలే అని, రాష్ట్రంలో కే‌ఏ పాల్ సైతం పోటీ చేస్తున్నారని, కేసీఆర్ పోటీ చేయడంలో తప్పు లేదని ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చడం కోసమే కేసీఆర్…జాతీయ పార్టీ పెట్టారని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

ఏపీ నుంచి వచ్చి బీఆర్ఎస్​లో చేరిన వారికి.. ఇంట్లో తిండి కూడా పెట్టరని, తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రజలను కలిసే సమయం ఇవ్వని కేసీఆర్‌.. పక్క రాష్ట్రం వాళ్లను మాత్రం కలుస్తున్నారని రేవంత్ విమర్శించారు. మొత్తానికి ఏపీలో కూడా కేసీఆర్ రాజకీయం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version