ఎడిట్ నోట్: కేసీఆర్ ‘కాంగ్రెస్’..!

-

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది అంతా అంతా కాంగ్రెస్ అనే చెబుతారు. ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పోయి ఉండొచ్చు..కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తర్వాత…ఎక్కువ బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. అలాగే ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన ఫైట్ చాలా కాలం నుంచి నడుస్తోంది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…తీవ్ర స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించి…రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా క్లారిటీ ఉంది. కానీ ఒక ఏడాది క్రితం నుంచి రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. కేవలం టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ఫైట్ నడుస్తోంది. ఎప్పుడైతే బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచ్చిందో..అప్పటినుంచి టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అటు బీజేపీ సైతం కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతుంది. బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ..తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ పై పోరాటం చేస్తుంది.

అటు కేంద్ర పెద్దలు కూడా తెలంగాణపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఇటు కేసీఆర్ సైతం..బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు…అసలు కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనడం లేదు. కేవలం బీజేపీ టార్గెట్ గానే ముందుకెళుతున్నారు. ఏ సభలోనైనా, మీడియా సమావేశంలోనైనా, ఆఖరికి అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్ టార్గెట్ మోదీ సర్కార్. అలాగే జాతీయ పార్టీ పెట్టి..కేంద్రంలో మోదీని గద్దె దించాలని చూస్తున్నారు.

దేశంలోని విపక్ష పార్టీలని ఏకం చేసి..బీజేపీకి చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. సరే రాజకీయం బాగానే ఉంది..కానీ కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. విపక్ష పార్టీలని కలుపుకున్నా సరే మోదీకి చెక్ పెట్టలేరు. పైగా కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఏది చేయలేరు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే కేసీఆర్ స్ట్రాటజీలో కాంగ్రెస్ పార్టీని కూడా కలిసేది ఉందని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలని కేసీఆర్ కలిశారు..వారిని ఏకం చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ లేకుండా…మిత్రపక్షాలు కేసీఆర్ వైపు రావడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ తప్పనిసరి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ అంటే శత్రువు మాదిరిగా పోరాడుతున్నారు. అసలు ఎట్టి పరిస్తితుల్లోనూ కేసీఆర్ తో కలిసే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.

కానీ పైన పరిణామాలు అలా కనిపించడం లేదు. కేసీఆర్ ఏమో..పరోక్షంగా రాహుల్ గాంధీకి మద్ధతుగా పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇటు రాష్ట్రంలో భట్టి విక్రమార్క లాంటి వారు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ..పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలబడుతున్నారు. ఈ పరిణామాలు బట్టి చూస్తే…కేసీఆర్-కాంగ్రెస్ కలిసేలా ఉన్నాయి. కాకపోతే ఈ కలయిక ఇప్పుడు ఉండదని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక..అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దాని బట్టి..పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి కేసీఆర్ రాజకీయం రాను రాను ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version