ఈ వారం ఓటీటీ/ థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాలివే..!

-

సెప్టెంబర్ లో పెద్ద సినిమాల సద్దడి లేకపోవడంతో.. చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి శుక్రవారం విడుదలైన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెప్టెంబర్ 9న మాత్రం బ్రహ్మాస్త్రం సినిమా విడుదల అయింది అయినా ఈ చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తర్వాత విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించింది. ఇక సెప్టెంబర్ 16వ తేదీన కూడా కొన్ని క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్/ ఓటిటి లో విడుదల అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

1). ఆ అమ్మాయి గురించి చెప్పాలి:
డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు . ఈ చిత్రం థియేటర్ లో 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

2). షాకిని డాకిని:
నివేద థామస్, రెజీనా ముఖ్యమైన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

3).K3-కోటికొక్కడు:
కన్నడ హీరో కిచ్చా సుదీప్ హీరోగా.. డైరెక్టర్ శివ కార్తికేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కన్నడలో విడుదల మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈనెల 16న థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

4). నేను మీకు బాగా కావాల్సిన వాడిని:
యువ హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీధర్ గదే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా మారారు. ఈ సినిమా 16న విడుదలకు సిద్ధంగా ఉంది.

5). సకల గుణాభీ రామ:
బిగ్ బాస్ 5 విన్నర్ విజే సన్నీ, ఆసియా హీరోయిన్గా డైరెక్టర్ శ్రీనివాస్ వెలుగొండ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది.

6). అం అః:
సుధాకర్ జంగం, లావణ్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది.

OTT:
1). కిరోసిన్-ఆహాలో సెప్టెంబర్ 16న విడుదల.

2). కాలేజ్ రొమాన్స్: సోనీ లీవ్ లో సెప్టెంబర్ 16న విడుదల.

3). విక్రాంత్ రోణ: డిస్నీ హట్ స్టార్ల ఈనెల 16న స్ట్రీమింగ్ కానుంది.

4). రామారావు ఆన్ డ్యూటీ: సెప్టెంబర్ 15న సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version