జనసేన అధినేత పవన్ కల్యాణ్..కీలక నిర్ణయం తీసుకున్నారు. కావాలని చెప్పారా? లేక బీజేపీ పొత్తులో కలుస్తుందని చెప్పారా? తెలియదు గాని..తాను మాత్రం ఎన్డీయే నుంచి బయటకొచ్చినట్లు చెప్పారు. ఇంతకాలం ఆయన బిజేపితో పొత్తులో ఉన్నామని చెప్పుకొచ్చారు. కానీ రెండేళ్ల క్రితం చంద్రబాబు కలిసిన దగ్గర నుంచి..వైసీపీపై టిడిపి-జనసేన కలిసి పోరాటం చేస్తాయని ఫిక్స్ అయ్యారు. అయితే టిడిపితో పొత్తు మాత్రం ప్రకటించలేదు.
కానీ ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్ళాక..ఆయన్ని జైల్లో కలిసొచ్చాక పవన్..టిడిపి-జనసేన కలిసి వెళ్తాయని అన్నారు. పొత్తు ఫిక్స్ చేసుకున్నారు. తమతో పాటు బిజేపి కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి టిడిపితో పొత్తు ఫిక్స్ చేసుకున్నారు. కానీ అప్పుడు బిజేపి నుంచి బయటకొచ్చినట్లు చెప్పలేదు. బిజేపి మాత్రం జనసేనతో కలిసే ఉన్నామని అంటుంది. అటు టిడిపితో మాత్రం కలవమని చెబుతుంది. పవన్ మాత్రం టిడిపి తో పొత్తు అన్నారు. ఇలా పొత్తులపై రకరకాలు సమీకరణాలు వచ్చాయి. కానీ దీనిపై ఏ మాత్రం క్లారిటీ రాలేదు.
తాజాగా పెడన సభలో మాత్రం పవన్ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు ఏదొక అంశంపై కన్ఫ్యూజ్ చేసే పవన్..బిజేపి నుంచి బయటకొచ్చేసినట్లే అని క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నప్పటికి తప్పలేదని చెప్పుకొచ్చారు. టిడిపి బలహీన పరిస్తితుల్లో ఉందని, కానీ ఆ పార్టీ అనుభవం రాష్ట్రానికి కావాలని, అలాగే జనసేన పోరాట పటిమ కలిస్తే జగన్‌ని ఓడించవచ్చు అని అన్నారు.
దీని బట్టి చూస్తే బిజేపితో పొత్తుకు పవన్ గుడ్ బై చెప్పేశారని చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ రెండు పార్టీలతో బిజేపి కలిసి పోటీ చేస్తుందా? లేదా? అనేది బిజేపి పెద్దలు నిర్ణయించాలి. బిజేపి కలుస్తానంటే అటు టిడిపి, ఇటు జనసేన రెడీగానే ఉన్నారు. కాకపోతే బిజేపి పరోక్షంగా జగన్‌కు మద్ధతు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. మరి బిజేపి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.