ఎడిట్ నోట్: రేవంత్‌కు కారు మైలేజ్!

-

తెలంగాణలో రాజకీయాలని అధికార బీఆర్ఎస్ మారుస్తుందా? పరిస్తితులకు తగ్గట్టు ప్రతిపక్షాల మైలేజ్ పెంచుతుందా? అనే పరిస్తితి కనిపిస్తుంది. మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పిని టార్గెట్ చేసి..ఆ పార్టీని ఇరుకున పెట్టాలని చూసింది గాని..దాని వల్ల బి‌జే‌పి మైలేజ్ పెరిగింది..ఇప్పటికీ బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోరు నడుస్తోంది. ఈ పోరులో మొన్నటివరకు కాంగ్రెస్ వెనుకబడింది కానీ రేవంత్ రెడ్డి పాదయాత్రతో మళ్ళీ సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ సైతం రేసులోకి వచ్చింది.

రేవంత్ తనదైన శైలిలో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై మాటల దాడి చేయడం..తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే అంశంపై కీలక హామీలు ఇస్తున్నారు. ఇలా హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. హామీలు ప్రజల్లోకి వేగంగా వెళ్ళాయి. అలాగే రేవంత్ సభలకు జనం కూడా భారీగా వస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ పాదయాత్రని అడ్డుకోవాలని చూసి అధికార బి‌ఆర్‌ఎస్ భంగపాటుకు గురైందని చెప్పాలి. తాజాగా రేవంత్ పాదయాత్రలో భాగంగా భూపాలపల్లిలో కార్నర్ సభ జరిగింది. సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు వచ్చారు.

 

అయితే అక్కడ కొంతమంది బి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చి హడావిడి చేశారు. రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభని అడ్డుకోవాలని చూశారు. దీంతో పోలీసులు వారిని పక్కనే ఉన్న సినిమా హాల్ లో పెట్టి గేట్లు మూసేశారు. అయినా సరే అక్కడ నుంచే రాళ్ళు, టమోటాలు, కోడి గుడ్లతో రేవంత్ సభపైకి విసిరారు. దీంతో ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు రివర్స్ లో దాడి చేశారు. ఈ క్రమంలో పలువురుకు గాయాలు అయ్యాయి.

ఇక ఇలా బి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు చేయడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదు. రివర్స్ లో ఈ అంశం బి‌ఆర్‌ఎస్ పార్టీకే డ్యామేజ్ చేసేలా కనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమం వల్ల రేవంత్ మైలేజ్ బి‌ఆర్‌ఎస్ పార్టీ పెంచిందని చెప్పాలి. ఇప్పటికే పాదయాత్రతో రేవంత్ మైలేజ్ పెరిగింది. ఇప్పుడు ఇలాంటి పనులు చేసి బి‌ఆర్‌ఎస్..స్వయంగా రేవంత్ బలం పెంచి..ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version