నేటి రాజకీయాల వ్యూహాలు మారిపోయాయి…నాయకులు వ్యూహాలు వేయడం కాదు..కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యూహాలు వేస్తే..వాటిని నాయకులు అమలు చేసే పరిస్తితి ఉంది. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఓ వ్యూహకర్తని నియమించుకుని ముందుకెళుతుంది. అయితే ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ఇటు వైసీపీ, అటు టిడిపి సైతం వ్యూహకర్తలతోనే ముందుకెళుతుంది. 2019 ఎన్నికల ముందే వైసీపీ బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా నియమించుకుంది.
ఆయన వ్యూహాలతోనే ముందుకెళ్లింది. 2019 ఎన్నికల్లో గెలిచింది. అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చాక జగన్..తన పాలనపైన నమ్మకంతో పాటు ప్రశాంత్ కిషోర్ దూరమైన..ఆయన టీం ఐప్యాక్ తో రాజకీయం నడిపిస్తున్నారు. ఇక అపరచాణక్యుడు అని చెప్పుకునే చంద్రబాబు సైతం టిడిపి కోసం రాబిన్ సింగ్ అనే వ్యూహకర్తని నియమించుకున్నారు అంటే పరిస్తితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఐప్యాక్ టీం వ్యూహాలతో వైసీపీ దూసుకెళుతుంది. రెండోసారి విజయం దక్కించుకోవాలని చూస్తుంది.
అయితే వైసీపీలో ఐప్యాక్ డామినేషన్ ఎక్కువ ఉందని..అసలు జగన్ పార్టీ నేతల కంటే ఐప్యాక్ టీంనే ఎక్కువ నమ్ముతున్నారని, ప్రతి దానిలో ఐప్యాక్ టీం జోక్యం ఉంటుందని అంటున్నారు. అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేనిది ఉన్నట్లు సృష్టించడం, ఎదుటి వాళ్ల బలహీనతలు, పొరపాట్లను భూతద్దంలో చూపించడం, అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం, దొంగ ఓట్లు సృష్టించడం లాంటివి ఐప్యాక్ టీం చేస్తుందని టిడిపి ఆరోపిస్తుంది.
అలా ఫేక్ పాలిటిక్స్ చేసి ఐప్యాక్ టీం ముందుకెళుతుందని అంటున్నారు. అయితే ఎలా ముందుకెళుతుంది అనేది పక్కన పెడితే…వైసీపీ గెలుపుకోసం ఐప్యాక్ టీం గట్టిగానే పనిచేస్తుంది. మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. పైగా అధికార బలం ఉండటంతో ఐప్యాక్ టీం ఎక్కడకైనా వెళుతుంది..ఏదైనా చేస్తుంది. ఇలా ఆ టీం…వైసీపీ గెలుపు కోసం రకరకాల వ్యూహాలు వేస్తుంది. మరి చివరికి ఐప్యాక్ టీం వైసీపీని గెలిపిస్తుందో లేదో చూడాలి.