ఎలాంటి రామోజీకి ఎలాంటి పరిస్థితి వచ్చింది!

-

తెలుగు మీడియా రంగంలో ఈనాడు గురించి ఏమాత్రం పరిచయం అక్కరలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ పత్రిక తర్వాతే మరే పత్రికైనా అన్నస్థాయిలో పేరు సంపాదించుకుంది. దీనికి ప్రధాన కారణం.. రామోజీ ఈ పత్రికను తన మానస పుత్రికగా భావించడమే కారణం! ఆ సంగతులు అలా ఉంచితే… ఈ పత్రిక ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటుందని, ఆ పార్టీకి సంబందించిన ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుందని విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. అది వాస్తవం అనేవారే ఎక్కువ. అయితే… తాజాగా తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ లు ముఖ్యమంత్రులు అయిన అనంతరం ఈనాడు చెక్ పడుతుందని అంటున్నారు.

సుమారు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో తనదైన పాత్ర పొషిస్తోన్న ఈనాడుపై నేరుగా అసెంబ్లీలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విరుచుకుపడేవారు! ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంపై ఏస్థాయి విమర్శలు చేయడానికైనా వెనుకాడని రామోజీ.. తెలంగాణ సర్కార్ విషయంలో మాత్రం ఆ ధైర్యం చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది తాజా వ్యవహారం.

ఈ ఏడాది మొదట్లో తెలంగాణ ఈనాడు ఎడిషన్ లో మొదటిపేజీలో… దొంగలతో పోలీసులు దోస్తీ కడుతున్నారాని, ఫలితంగా పోలీస్ శాఖపై ప్రజలకున్న నమ్మకంపై నీలినీడలు కమ్ముకున్నాయని చెబుతూ “దొంగల దోస్తీ” శీర్షికతో ఒక కథనం ప్రచురించారు. ఈ విషయంపై కేసీఆర్ ఫైరయ్యారు. దీంతో మరుసటిరోజే అదేపేజీలో సవరణ లాంటి వివరణ ప్రచురించాల్సిన పరిస్థితి ఈనాడుకు వచ్చింది. నాటి నుంచీ తెలంగాణలో ఎలాంటి రాజకీయ సంచలనాలు చోటుచేసుకున్నా.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసిచూడనట్లుపోతుంది ఈనాడు!

ఇక ఈ విషయంలో జగన్ పత్రిక సాక్షి అప్పర్ హ్యాండ్ తీసుకుంది. తెలంగాణ సర్కార్ చేసే మంచి పనులను వీలైనంత బలంగా చూపిస్తూ ముందుకు పోతుంది. దీంతో తాజాగా పీవి నరసింహారావు శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా… నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలకు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చిన టి.సర్కార్… ఈనాడు – ఆంధ్రజ్యోతిలకు ఇవ్వలేదు. అలా అని ఇప్పటికీ తెలంగాణ సర్కార్ కు నెగిటివ్ వార్తలు ఇచ్చే విషయంలో ఈనాడు ధైర్యం చేయడం లేదనే విమర్శలూ వస్తూనే ఉన్నాయి.

ఈస్థాయికి చేరుకున్నాక కూడా రామోజీ పరిషితి ఇలా పడిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.  వైఎస్ హయాంలో ప్రభుత్వం పై బురద జల్లిన ఉత్సాహం నేడు రామోజీలో కనిపించకపోవడంతో.. ఇటు కేసీఆర్ ను కూడా కదిలించలేని పరిస్థితుల్లో… కేవలం చంద్రబాబుని పొగుడుతూ మాత్రమే కాలం వెల్లదీస్తుందనే కామెంట్లు పెరిగిపోతున్నాయి. ఎలాంటి రామోజీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందనే మాటలూ పెరుగుతున్నాయి!! ఏమి వదులుకున్నాపర్లేదు కానీ… ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకూడదని చెప్పే రామోజీరావు కు నేడు అదేపరిస్థితి రావడం ఆశ్చర్యమే!

Read more RELATED
Recommended to you

Exit mobile version