రుతుపవనాల ఎఫెక్టు..సాగునీటిపారుదల శాఖలో బదిలీల ప్రక్రియకు బ్రేక్

-

ప్రస్తుత రుతుపవనాల ఎఫెక్టు, భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద తదితర పలు కారణాలతో రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో సాధారణ బదిలీల ప్రక్రియను నిలిపివేస్తూ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు.

ఇంజినీర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని బదిలీలతో ఏర్పడే ఇబ్బందిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉండేలా సాగునీటి పారుదల శాఖ ఆలోచిస్తున్నది. ఇంజినీర్-ఇన్-చీఫ్ నుంచి వచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న సెక్రటరీ రాహుల్‌బొజ్జా ఈ ఉత్తర్వులను జారీచేశారు. శాఖాపరంగా ఇంజినీర్ల అవసరాలను, సేవల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ,వాటర్ ఇయర్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంటు కొన్ని పనులకు సంబంధించి వర్క్ షెడ్యూలు రూపొందించుకున్నదని 1ఉత్తర్వుల్లో సెక్రటరీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆన్-గోయింగ్ ప్రాజెక్టుల పనులకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల రిపేర్ పనులు, మెయింటెనెన్స్, ఆపరేషన్ తదితర అవసరాలు కూడా ఉన్నాయని, వీటికి ఇబ్బంది కలుగకూడదన్న అంచనాతో సాగునీటి పారుదల శాఖలో అన్ని స్థాయిల్లోని ఇంజినీర్ల సాధారణ బదిలీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version