చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్

-

చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ వెల్లడించారు.

వాటిలో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ ఉద్యోగాలు 22 ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆమె తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని , ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడు సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుందని శైలజారామయ్యర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version