ఈ ఉప్పువాడితే .. జబ్బులు కొని తెచ్చుకున్నట్టే..?

-

నలభీముల్లా బ్రహ్మాండంగా వంట చేసినా..అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఏమాత్రం రుచించదు. అంత ఇంపార్టెన్స్ ఉప్పుది. మనం నిత్యం వాడే ఆహార పదార్థాల్లో ఇది ఒకటి. ఉప్పులేకుండా మనకు ముద్ద దిగదు. అయితే పాత కాలంలో మనం సముద్రపు ఉప్పు వాడేవాళ్లం. అది గల్లు గల్లుగా ఉండేది.

ఆ తర్వాత అయోడిన్ లోపం కారణంగా అనేక జబ్బులు వస్తున్నాయని అయోడిన్ ను ఉప్పులో కలిపి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అయోడిన్ ఉప్పు కారణంగా జనం సాధారణ ఉప్పు వాడటం మానేశారు. అయితే ఇప్పుడు ఈ అయోడిన్ ఉప్పే రోగాలకు కారణమవుతుందంటున్నారు కొందరు వైద్య నిపుణులు..

ఈ అయోడిన్ ఉప్పు వాడకం వల్ల థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. పాతకాలంలో ఎక్కడో ఒకటి ఉంటే థైరాయిడ్ కేసు..ఇప్పుడు వీధివీధికో థైరాయిడ్ కేసు కనిపిస్తుందని చెబుతున్నారు. ఇదంతా అయోడిన్ ఉప్పు కారణంగానే జరుగుతోందంటున్నారు. అందుకే సాధ్యమైనంత వరకూ అయోడిన్ ఉప్పును మానేయాలని సూచిస్తున్నారు.

మరి ఉప్పు లేకుండా ఎలా అంటారా.. వీలైతే సముద్రపు ఉప్పు వాడాలని సూచిస్తున్నారు. అది దొరక్క పోతే.. ఆయుర్వేద షాపుల్లో దొరికే సైంధవ లవణం వంటి ఉప్పు వాడమని సలహా ఇస్తున్నారు. అది కూడా సాధ్యమైనంత తక్కువ వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version