తెలంగాణలో అంగన్వాడి విద్యార్థులకు మంత్రి సీతక్క శుభవార్త అందజేశారు. చిన్నపిల్లలకు ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని సీతక్క సూచించారు.

చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని మరింత రుచికరంగా తయారు చేసి అందిస్తామని సీతక్క అన్నారు. వారంలో ఒకటి రెండు సార్లు చిన్నపిల్లలకు ఎగ్ బిర్యానీ అందించేలా మెనూ మార్చబోతున్నామని సీతక్క స్పష్టం చేశారు. ఈ విధానాన్ని తొందర్లోనే ప్రారంభిస్తామని సీతక్క వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అంగన్వాడి విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో సీతక్క తీసుకున్న ఈ నిర్ణయానికి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.