ఎగ్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసా?

-

కోడి గుడ్డు.. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఫుడ్డు. న సండే.. న మండే.. డెయిలీ కావో అండే.. అంటారు పెద్దలు. చిన్నపిల్లలకు ఉడికించిన గుడ్డును రోజూ తినిపించాలంటారు పెద్దలు. అయితే.. చాలామందికి వట్టి ఉడికించిన గుడ్డు తినాలంటే నచ్చదు. ఎందుకంటే.. అది ఏ టేస్టూ ఉండదు కాబట్టి. అటువంటి వారి కోసమే ఎగ్ చట్నీ అనే స్పెషల్ వంటకం ఉంది. దాన్ని పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. మరి.. దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?

ఓ డజను కోడి గుడ్లు తీసుకోండి. వాటిని ఉడకబెట్టండి. పోట్టు తీయండి. ఓ గిన్నెలో నూనె పోసి గుడ్లను వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత.. కొన్ని మెంతులు తీసుకొని వాటిని వేయించండి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఏదైనా లోతుగా ఉన్న ఓ పాత్ర తీసుకోండి. దాంట్లో తగినంత నూనె పోసి.. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, మెంతిపిండి వేసి బాగా కలపండి. ఆ మిశ్రమంలో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా కలపండి. తర్వాత మరో గిన్నెలో కొంచెం నూనె పోసి.. గ్యాస్ మీద పెట్టి.. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపు పెట్టండి. తర్వాత ఆ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలపండి.

అనంతరం.. కొన్ని వెల్లుల్లి రెక్కలను ఆ మిశ్రమంపై వేసి గార్నిష్ చేయండి. అంతే.. కోడిగుడ్డు పచ్చడి రెడీ. దీన్ని పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు. ఇది చాలారోజులు నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటున్నా కొద్దీ దీని టేస్ట్ కూడా పెరుగుతుంటుంది. మామిడికాయ, టమాట పచ్చడి లాగానే దీన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version