ఎనిమిదోరోజు సర్వభూపాల వాహనంలో శ్రీవారు !

-

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శనివారం ఉదయం 7.00 గంటలకు రథోత్సవం బదులుగా శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.


సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు.

రాత్రి అశ్వవాహనంలో

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. అశ్వవాహనాన్ని అధిరోహించి కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version