ఏపీలో అధికార వైసీపీ దూకుడుకు తెలుగుదేశం పార్టీ నేతలలో భయాందోళనలు పెరిగిపోతుండటంతో ఎప్పటి కప్పుడు పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచే విధంగా చంద్రబాబు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాత నీరు పోతుండడంతో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలినే రేపు టీడీపీ జిల్లా కమిటీల ప్రకటన చేయనున్నారు అధినేత చంద్రబాబు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి 25 మంది అధ్యక్షులను ప్రకటించనునన్నారు చంద్రబాబు. ఉదయం 11.50 నిముషాలకి ఈ కమిటీల ప్రకటన ఉండవచ్చని చెబుతున్నారు.
ప్రతి పార్లమెంట్ ఒక యూనిట్ గా జిల్లా అధ్యక్ష్యుల ప్రకటన ఉండవచ్చని చెబుతున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష్యుడు, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా రేపు ప్రకటించవచ్చని అనుకున్నా దానిని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలని కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జిల్లా కమిటీలతో పాటు కొత్తగా 13 జిల్లాలకి 13 మంది సమన్వయకర్తలని నియమించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా కింజరాపు అచ్చెన్నని ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని గాడిలో పెట్టేందుకు జిల్లా కార్యవర్గాలను పూర్తిగా ప్రక్షాళన చేసి, ఉత్సాహవంతులైన వారికి ఆ పదవులను కట్టబెట్టేందుకు చంద్రబాబు కసరత్తులు చేసి రేపటి లిస్టు రేడీ చేసినట్టు చెబుతున్నారు.