శృంగారం త‌ప్పు.. అత్యాచారం చేస్తే క‌రెక్టేనా..?

-

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా క‌పూర్‌పై తాజాగా ఎఫ్ఐఆర్ న‌మోదైన విష‌యం విదిత‌మే. ఆమె ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ యాప్‌లో అందుబాటులో ఉన్న ఓ సిరీస్‌లో భార‌త ఆర్మీ అధికారుల‌ను అవ‌మాన ప‌రిచే విధంగా స‌న్నివేశాలున్నాయంటూ.. కొంద‌రు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే ఈ విష‌యంపై ఏక్తా క‌పూర్ స్పందించారు.

ఆల్ట్ బాలాజీ యాప్‌లో ఓ సిరీస్‌లో శృంగార స‌న్నివేశాల‌ను చూపించామ‌ని, అది త‌ప్ప‌ని భావిస్తున్నార‌ని, అందుకే కొంద‌రు త‌న‌పై కేసు పెట్టార‌ని.. మ‌రి అత్యాచారం చేస్తే ఓకేనా.. అని ఏక్తా క‌పూర్ ప్ర‌శ్నించారు. ”నా‌కు కొంద‌రి నుంచి అస‌భ్య‌క‌రమైన వేధింపు కాల్స్ వ‌స్తున్నాయి, నాపై అత్యాచారం చేస్తామంటూ.. కొంద‌రు న‌న్ను బెదిరిస్తున్నారు..” అని ఏక్తా తెలిపింది.

అయితే ఆల్ట్ బాలాజీ యాప్‌లో నిజానికి అనేక సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలా సిరీస్‌ల‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంది. దీనిపై ఏక్తా స్పందించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version